: ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందే: ప్రకాశ్ కారత్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ప్రకటించాలని సీపీఎం జాతీయ నేత ప్రకాశ్ కారత్ డిమాండ్ చేశారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ, విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ రాజధానిని కోల్పోయిందని అన్నారు. రాజధాని లేని రాష్ట్రానికి ఎన్నో అవసరాలు ఉంటాయని చెప్పారు. విభజన కారణంగా ఏపీ ఆర్ధికంగా చాలా నష్టపోయిందని చెప్పిన ఆయన, ఆర్థిక లోటు పూడ్చాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని ఆయన చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా కోసం జాతీయ స్థాయిలో తమ పార్టీ పోరాడుతుందని ఆయన తెలిపారు.