: మా ప్రాణాలు కాపాడేందుకే నా బిడ్డ లొంగిపోయింది, లేకుంటేనా వాళ్లతో పోరాడేది!: బులంద్ షహర్ గ్యాంగ్ రేప్ కేసులో బాలిక తండ్రి


సంచలనం రేపిన బులంద్ షహర్ గ్యాంగ్ రేప్ కేసులో, బాధితురాలి తండ్రి 'నవభారత్ టైమ్స్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ ప్రాణాలను కాపాడేందుకే తన కుమార్తె ఆ దుండగులకు లొంగిపోయిందని విలపించారు. 13 సంవత్సరాల తన కుమార్తెకు చిన్న నాటి నుంచే మార్షల్ ఆర్ట్స్ నేర్పించానని, తనపై అత్యాచారానికి ఒడిగట్టిన ఓ దుర్మార్గుడిని దాదాపు 30 నిమిషాల పాటు ఎదిరించి పోరాడిందని గత శుక్రవారం నాడు జరిగిన ఘటనను వెల్లడించారు. ఆపై మరో దుండగుడు తుపాకితో తనకు, తన సోదరుడికి గురిపెట్టి కాల్చి చంపుతానని హెచ్చరించిన తరువాతనే వాడికి లొంగిపోయిందని విలపించారు. తామే లేకుంటే, వారిని పోరాడేదే తప్ప లొంగేది కాదని అన్నారు. తమ కోసమే తన బిడ్డ అంతటి బాధనూ ఓర్చుకుందని వాపోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపగా, యూపీలో రక్షణ లేకుండా పోయిందని, ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ రాజీనామా చేయాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News