: గ్యాంగ్‌స్టర్ సొహ్రబుద్దీన్ ఎన్కౌంటర్ కేసులో అమిత్ షాకు ఊరట
గ్యాంగ్‌స్టర్ సొహ్రబుద్దీన్ నకిలీ ఎన్కౌంటర్ కేసులో భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలయిన విషయం తెలిసిందే. అయితే ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఈరోజు తోసిపుచ్చింది. సొహ్రబుద్దీన్ నకిలీ ఎన్కౌంటర్ కేసులో అమిత్‌షాపై మళ్లీ విచారణ చేపట్టేదిలేదని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. 2005లో గుజరాత్లో అమిత్‌షా హోం మంత్రిగా ఉన్న సమయంలో పోలీసు కస్టడీలో సొహ్రబుద్దీన్ ఎన్కౌంటర్లో మరణించాడు. రాజకీయ కారణాల వల్లే అమిత్ షా ఆయనను ఎన్కౌంటర్ చేయించారనే ఆరోపణలపై విచారణ కొనసాగింది. 2012లో సీబీఐ ఈ కేసు విచారణను చేపట్టింది. అయితే దీనిపై ఎటువంటి ఆధారాలు లేవంటూ 2014లోనే ముంబయి కోర్టు అమిత్‌షాపై వచ్చిన ఆరోపణలను కొట్టేసింది. అయితే, దీనిపై ఆయనకు క్లీన్ చిట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దేశ అత్యున్నత న్యాయస్థానం ఈరోజు ఈ పిటిషన్‌ను కొట్టివేసింది.