: అవసరమైతే బీజేపీతో కటీఫ్: గంటా సంచలన ప్రకటన
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం అవసరమైతే బీజేపీతో తెగతెంపులు చేసుకోవడానికి సిద్ధమని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజల సెంటిమెంటును నిలిపి, ప్రయోజనాలను కాపాడేందుకు తెలుగుదేశం పార్టీ ఎంతటి త్యాగాలకైనా వెనుకాడబోదని ఆయన అన్నారు. నేడు విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఢిల్లీలో నిలదీయలేని జగన్, చంద్రబాబును విమర్శించినంత మాత్రాన ఫలితం ఉండదని చెప్పారు. ప్రధానిని జగన్ ఎందుకు ప్రశ్నించడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల అభిమతాన్ని తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని గంటా ఆరోపించారు.