: కాబూల్‌లో విదేశీ కాంట్రాక్టర్లు ఉంటున్న బిల్డింగ్‌పై లారీ బాంబుతో మరోసారి దాడి
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో తాలిబన్లు రెచ్చిపోయారు. విదేశీ కాంట్రాక్టర్లు ఉంటున్న బిల్డింగ్‌పై లారీ బాంబుతో మరోసారి దాడులకు తెగబడ్డారు. మూడేళ్ల క్రితం ఇదే బిల్డింగ్‌పై ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. కాంపౌండ్‌లోకి ప్రవేశించడం కోసం మొదట దానిలోని ఓ గేట్‌ను పేల్చివేసిన ఉగ్రవాదులు అనంతరం లారీతో లోపలికి చొరబడి బాంబు దాడి చేశారు. భద్రతా బలగాలు వెంటనే అక్కడకు చేరుకొని ఎదురుకాల్పులు జరిపాయి. ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఓ పోలీస్అధికారి, ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. మరో ముగ్గురు పోలీసులకి తీవ్రగాయాలయ్యాయి.