: విద్యార్ధుల కోసం ఇంద్రకీలాద్రిపై 'విజయీభవ'


విద్యార్ధుల శ్రేయస్సును కాంక్షిస్తూ ... వారికి ఆశీస్సులు అందజేయమని ప్రార్ధిస్తూ ... విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయంలో ఈ రోజు 'విజయీభవ' పేరిట ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా దుర్గామల్లేశ్వర దేవస్థానం వారు ఇంద్రకీలాద్రి అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరిస్తున్నారు.

త్వరలో పరీక్షలు రాయనున్న విద్యార్ధుల్లో ఆత్మ విశ్వాసాన్ని నింపి... పరీక్షల్లో విజయం సాధించేలా ఆశీర్వదించమని కోరుతూ అమ్మవారికి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ ఉదయం ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటల వరకు భవానీ దీక్ష మండపంలో సరస్వతీ యాగం నిర్వహిస్తున్నారు. విద్యార్ధులు ఈ సందర్భంగా అమ్మవారిని సందర్శించి ఆశీస్సులు పొందవచ్చని దేవస్థానం పేర్కొంది.

  • Loading...

More Telugu News