: సలహా అడిగారుగా ఇదిగో...!: మోదీకి కేజ్రీవాల్ జవాబు


స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ, ఎర్రకోటపై నుంచి తాను ఏం మాట్లాడాలో తెలియజేయాలని కోరిన ప్రధాని మోదీకి, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తనదైన శైలిలో సమాధానాన్ని పంపారు. "సార్! దళితులపై జరుగుతున్న దాడులు, గోరక్ష పేరిట జరుగుతున్న హింస, కాశ్మీరులో అల్లర్లు, రైతుల ఆత్మహత్యలు, ధరల పెరుగుదల తదితరాలపై దయచేసి మాట్లాడండి" అని తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ప్రజలు చనిపోతున్నా దాన్ని చూడకుండా ప్రభుత్వం గుడ్డిగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కాగా, పంద్రాగస్టు వేడుకల్లో 125 కోట్ల మంది భారతీయ యువవాణినే తాను వినిపిస్తానని, తాను ఏం మాట్లాడాలో నరేంద్ర మోదీ మొబైల్ యాప్ ద్వారా సలహాలు ఇవ్వాలని నిన్నటి 'మన్ కీ బాత్'లో ప్రధాని కోరిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News