: 'అభద్రతను పెంచుతున్నారు': పార్లమెంటులో అమీర్ ఖాన్ వ్యాఖ్యలపై చర్చ... పారికర్ పై ముప్పేట దాడి!
అమీర్ ఖాన్ ఎప్పుడో చేసిన వ్యాఖ్యలపై మనోహర్ పారికర్ చేసిన వ్యాఖ్యలు గర్హనీయమని రాజ్యసభలో విపక్షాలు ముప్పేట దాడి చేశాయి. అమీర్ ఖాన్ పేరును ప్రస్తావించకుండా, భారత్ పై అసహనాన్ని వ్యక్తం చేస్తూ, దేశం విడిచి వెళ్లాలని ఉన్నట్టు చెప్పిన నటుడికి తగిన గుణపాఠం చెప్పాలని పారికర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, "రక్షణ మంత్రి స్వయంగా దేశంలో అభద్రతాభావాన్ని పెంచుతున్నారు" అంటూ సీపీఐ (ఎం) సభ్యుడు సీతారాం ఏచూరి జీరో అవర్ లో ఈ విషయాన్ని లేవనెత్తారు. దీంతో రాజ్యసభలో కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది. తాను కేవలం దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యానిస్తున్న వారిని ఉద్దేశించి మాత్రమే మాట్లాడానని, వాక్ స్వాతంత్ర్యపు హక్కును తాను ప్రస్తావించ లేదని, ఎవరి పేరునూ పలకలేదని, అసలు 'గుణపాఠం' అన్న పదమే వాడలేదని రాజ్ నాథ్ స్పష్టం చేసినా రభస సద్దుమణగలేదు.