: రెండు శాఖల మధ్య సమన్వయ లోపం!... ఏపీ వ్యాప్తంగా నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు!


నవ్యాంధ్రలోని రెండు ప్రభుత్వ శాఖల మధ్య ఏర్పడ్డ సమన్వయ లోపం... ఏకంగా ఏపీవ్యాప్తంగా రిజిస్ట్రేషన్లను నిలిపేసింది. ఫలితంగా ఏపీ ఆదాయానికి భారీ గండి పడింది. వివరాల్లోకెళితే... ఏపీలో భూముల ధరలను పెంచుతూ నిన్న ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకేసారి 30 శాతం భూముల ధరలను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కర్నూలు, చిత్తూరు, కృష్ణా జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల్లో అమల్లోకి వచ్చాయి. అయితే రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల మధ్య నెలకొన్న సమన్వయ లోపం కారణంగా పెంచిన భూముల ధరలు ఆన్ లైన్ లోకి ఎక్కలేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నేటి ఉదయం నుంచి భూముల క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది.

  • Loading...

More Telugu News