: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు, కోసాంధ్ర రాయలసీమల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని తెలిపింది. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని, అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు వర్షాలు పడుతాయని పేర్కొంది. తెలంగాణలోని పలు చోట్ల, కోస్తాంధ్రలోని అన్ని ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. రాయలసీమలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.