: బెజవాడలో కాంగ్రెస్ విద్రోహ సదస్సు!... ‘హోదా’పై టీడీపీ, బీజేపీ నాటకాలాడుతున్నాయని ఆరోపణ!
ఏపీకి ప్రత్యేక హోదా దక్కకుండా టీడీపీ, బీజేపీలు నాటకాలాడుతున్నాయని కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. ఏపీకి ప్రత్యేక హోదా కోసం తమ ఎంపీ కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రతిపాదించిన ప్రైవేటు మెంబర్ బిల్లును బీజేపీ అడ్డుకున్న వైనంపై నేటి ఉదయం కాంగ్రెస్ పార్టీ బెజవాడలో విద్రోహ సదస్సు పేరిట భారీ నిరసన ప్రదర్శనకు తెర తీసింది. సదస్సుకు ముందుగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించింది. అనంతరం జరిగిన సదస్సులో ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, పార్టీ ఎంపీలు, మాజీ మంత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నేతలు మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించకుండా బీజేపీ నమ్మక ద్రోహానికి పాల్పడగా, అందుకు టీడీపీ కూడా వత్తాసు పలికేలా వ్యవహరించిందని ఆరోపించారు. వెరసి ఆ రెండు పార్టీలు ఏపీకి ప్రత్యేక హోదా దక్కకుండా డ్రామాలాడుతున్నాయని వారు ధ్వజమెత్తారు.