: ‘హోదా’ కోసం ఒక్కటైన టీడీపీ, వైసీపీ!... లోక్ సభలో కలిసికట్టుగా నిరసన!


ఏపీకి ప్రత్యేక హోదా సాధన విషయంలో రాష్ట్రంలోని రెండు ప్రధాన రాజకీయ పార్టీలు టీడీపీ, వైసీపీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అయితే పార్లమెంటులో మాత్రం కొద్దిసేపటి క్రితం ఆ రెండు పార్టీలు దాదాపుగా కలిసిపోయాయి. కలిసికట్టుగా బీజేపీ తీరుపై విరుచుకుపడ్డాయి. నేటి పార్లమెంటు సమావేశాలకు ముందు పార్లమెంటు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం ముందు నిరసన ప్రదర్శన చేపట్టిన టీడీపీ ఎంపీలు చేతుల్లో ప్లకార్డులతోనే లోక్ సభలోకి ఎంటరయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. టీడీపీ నేతల డిమాండ్లతో సభలో గందరగోళం నెలకొంది. ఈ సమయంలో సభలో ప్లకార్డులు చూపరాదంటూ స్పీకర్ సుమిత్రా మహాజన్ టీడీపీ ఎంపీలకు సూచించారు. స్పీకర్ సూచనతో ఆగ్రహావేశాలకు గురైన టీడీపీ ఎంపీలు పోడియాన్ని చుట్టుముట్టారు. ఇదే సమయంలో రంగంలోకి దిగిన వైసీపీ ఎంపీలు కూడా స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నిరసనకు దిగారు. వెరసి నిత్యం పరస్పర ఆరోపణలు గుప్పించుకుంటున్న టీడీపీ, వైసీపీలు... ఏపీకి ప్రత్యేక హోదా కోసం కలిసికట్టుగా నిరసనకు దిగినట్లైంది.

  • Loading...

More Telugu News