: ఇక వైసీపీ వంతు!... ఏపీకి ప్రత్యేక హోదా కోసం లోక్ సభలో జగన్ పార్టీ వాయిదా తీర్మానం!


ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ నిన్నటిదాకా రాజ్యసభను కదిపేస్తే... తాజాగా పార్లమెంటులో దిగువ సభ లోక్ సభలోనూ ఈ అంశం పెను చర్చకు దారితీసేలానే ఉంది. ఇప్పటికే ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఎంపీలు లోక్ సభలో ప్లకార్డులు చేతబట్టి నిరసనలతో హోరెత్తించారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టిన టీడీపీ ఎంపీలు సభలో గందరగోళానికి కారణమయ్యారు. ఈ తరుణంలో ఏపీలో విపక్షం వైసీపీ కూడా రంగంలోకి దిగింది. ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చకు అనుమతించాలంటూ ఆ పార్టీ ఎంపీలు లోక్ సభ స్పీకర్ కు వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించారు.

  • Loading...

More Telugu News