: పుట్టిన పది రోజులనుంచే పాలిస్తోన్న లేగదూడ!
ఆ ఆవు దూడ పుట్టి రెండు వారాలయినా కాలేదు. పాలు తాగాల్సిన ఆ దూడ అప్పుడే పాలిచ్చేస్తోంది. ఒడిశాలోని పూరీ జిల్లా అస్తరంగ సమితి రాయబేర గ్రామంలో రమేష్ ప్రధాన్ ఇంట్లో ఈ ఆశ్చర్యకర నిజం వెలుగుచూసింది. పుట్టిన పది రోజులకే ఆ దూడనుంచి పాలు రావడం ప్రారంభమయ్యాయని రమేష్ తెలిపారు. దాని పొదుగు నుంచి పాలు చుక్కలు రావడం చూసి పితకడం ప్రారంభించానని, ప్రతిరోజు ఆ దూడ 300 మిల్లీలీటర్ల వరకు పాలు ఇస్తోందని తెలిపారు. విషయాన్ని తెలుసుకున్న పశువైద్యులు ఆ దూడకు పరీక్షలు జరిపి, శరీరంలో హార్మోనుల సమతుల్యత సరిగా లేని కారణంగా ఆ దూడ పాలిస్తోందని పేర్కొన్నారు.