: ప్లకార్డులు చేతబట్టిన టీడీపీ!... పార్లమెంటులో ఆవరణలో ఎంపీల నిరసన!


ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ అధికార కూటమిలోని మిత్రపక్షం టీడీపీ నిరసనలకు శ్రీకారం చుట్టింది. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సూచనలతో నేటి ఉదయం పార్లమెంటుకు వచ్చిన ఆ పార్టీ ఎంపీలు ప్లకార్డులు చేతబట్టి పార్లమెంటు ఆవరణలో నిరసనకు దిగారు. ఓ చేత్తో ‘ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి’ అని తెలుగులో రాసి ఉన్న పెద్ద బేనర్ ను, మరో చేత్తో 'వీ డిమాండ్ స్పేషల్ స్టేటస్ ఫర్ ఆంధ్రప్రదేశ్’ అని ఆంగ్లంలో రాసి ఉన్న ప్లకార్డులను చేతబట్టి నిరసనకు దిగారు. పార్లమెంటు ఆవరణలోని జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం ముందు జరుగుతున్న ఈ నిరసనలో ఉభయసభల్లోని టీడీపీకి చెందిన అందరు ఎంపీలు పాలుపంచుకున్నారు.

  • Loading...

More Telugu News