: హైదరాబాద్లో లారీ బీభత్సం... ఇద్దరి మృతి
హైదరాబాద్లో ఓ లారీ బీభత్సం సృష్టించింది. మియాపూర్ మదీనాగూడలో అదుపుతప్పిన ఓ లారీ రోడ్డుపక్కన మొక్కలు విక్రయించే వారిపైకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులిచ్చిన సమాచారంతో వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారిని శ్రీనివాస్, ఆదిబాబుగా పోలీసులు గుర్తించారు. తూర్పుగోదావరి జిల్లాలోని కోరుమిల్లి వాసులయిన వీరు.. మదీనాగూడలో కొంతకాలంగా నర్సరీని నడుపుతున్నారని పేర్కొన్నారు.