: కొత్త పార్టీని ప్రకటించనున్న ఆప్ బహిష్కృత నేతలు


బహిష్కృత ఆప్ నేతలు యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ లు కొత్త పార్టీని ప్రకటించారు. ఇప్పటికే 'స్వరాజ్ అభియాన్' పేరిట ఉద్యమిస్తున్న వీరు, దానినే తమ పార్టీ పేరుగా నిర్ణయించారు. గాంధీ జయంతి అయిన అక్టోబర్ 2న అధికారికంగా పార్టీ ఆవిర్భవిస్తుందని, ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా ఇది ఉంటుందని వివరించారు. స్వరాజ్ అభియాన్ జాతీయ సదస్సుకు హాజరైన కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన యోగేంద్ర యాదవ్, తమకు ఎలాంటి రాజకీయ కోరికలూ లేవని, 93 శాతం మంది అభియాన్ కార్యకర్తలు రాజకీయ పార్టీని ప్రారంభించాలని ఒత్తిడి తెచ్చిన మీదటే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. 433 మంది డెలిగేట్స్ లో 405 మంది పార్టీని పెట్టాలని కోరుకుంటున్నట్టు యాదవ్ ప్రకటించిన వేళ, సదస్సు ప్రాంగణం, "వందేమాతరం", "ఇంక్విలాబ్ జిందాబాద్", "భారత్ మాతాకీ జై" వంటి నినాదాలతో మార్మోగింది. కాగా, ఈ ఇద్దరూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ గత సంవత్సరం ఏప్రిల్ లో అరవింద్ కేజ్రీవాల్ వీరిని బహిష్కరించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News