: నర్సింగ్ యాదవ్ రియో ఫ్లైటెక్కేనా!... నేడు కీలక నిర్ణయం తీసుకోనున్న నాడా!
రియో ఒలింపిక్స్ కు సమయం దగ్గరపడుతోంది. క్రీడాకారులంతా లగేజీ సర్దుకుంటున్నారు. అయితే ఈ క్రీడా సంగ్రామంలో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు ఇప్పటికే అవకాశం దక్కించుకున్న రెజ్లింగ్ క్రీడాకారుడు నర్సింగ్ యాదవ్ చుట్టూ డోపింగ్ ఆరోపణలు చుట్టుముట్టాయి. డోపింగ్ కు నర్సింగ్ యాదవ్ పాల్పడ్డట్టు ఇప్పటికే పక్కా ఆధారాలు లభ్యమైన నేపథ్యంలో నేడు నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) తన నిర్ణయాన్ని వెల్లడించనుంది. నాడా నుంచి క్లీన్ చిట్ లభిస్తే నర్సింగ్ యాదవ్ రియో ఫ్లైట్ ఎక్కనున్నాడు. ఒకవేళ నాడా రెడ్ సిగ్నల్ వేస్తే మాత్రం ఈ మల్ల యోధుడికి రియో తలుపులు మూసుకుపోయినట్లే.