: ట్రంప్ కు ఓటేయలేదని సాక్ష్యం చూపితే బంపరాఫరే!
నవంబరులో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ కు ఓటు వేయలేదని చెబుతూ, అందుకు సాక్ష్యాన్ని తనకు చూపితే, తన నగ్న చిత్రాలను పంపుతానంటూ జెస్సికా రాబిట్ అనే భామ బంపరాఫర్ ఇస్తోంది. ఇప్పటికే 'ట్రాంప్స్ అగనెస్ట్ ట్రంప్' పేరిట ప్రచారం నిర్వహిస్తున్న ఆమె, ఓటేసే సమయంలో ట్రంప్ కు వేయలేదని తెలిపే ఫోటో సాక్ష్యం తనకు పంపిస్తే, న్యూడ్ చిత్రాలను పంపుతానని సంచలన ప్రకటన వెలువరించింది. కొందరు ట్రంప్ మద్దతుదారులతో తనకు సంబంధాలు ఉన్నాయని చెబుతున్న ఆమె ఒక్కొక్కటీ బయటకు వస్తాయని అంటుండటంతో, ఆయన ప్రత్యర్థి హిల్లరీ వర్గానికి ఇది శుభవార్తేనని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.