: గోడు వెళ్లబోసుకునేందుకు సమయం ఇవ్వండి!... మోదీకి టీడీపీ ఎంపీల లేఖ!


ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు ససేమిరా అంటున్న నరేంద్ర మోదీ సర్కారుకు నిన్న టీడీపీ ఎంపీలు ఓ లేఖ రాశారు. నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాసిన సదరు లేఖను ఎంపీలు ప్రధానమంత్రిత్వ కార్యాలయానికి పంపారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో తమ వాదనలు వినిపించుకునేందుకు కాస్తంత సమయం ఇవ్వాలని సదరు లేఖలో టీడీపీ ఎంపీలు కోరారు. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్ర విభజన చట్టంలోని హామీలు, గడచిన రెండేళ్లలో ఏపీకి జరిగిన అన్యాయాన్ని తెలుపుకునేందుకు సమయం కేటాయించాలని వారు ప్రధాని మోదీని కోరారు. ఈ లేఖపై టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత తోట నరసింహంతో పాటు ఇతర ఎంపీలు కూడా సంతకాలు చేశారు.

  • Loading...

More Telugu News