: చంద్రబాబును విమర్శించే అర్హత జగన్ కు లేదు!...తేల్చేసిన పల్లె రఘునాథరెడ్డి!
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడును విమర్శించే అర్హత వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేదట. ఈ మేరకు నిన్న టీడీపీ సీనియర్ నేత, ఏపీ ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో నిన్న మీడియాతో మాట్లాడిన సందర్భంగా పల్లె రఘునాథరెడ్డి...జగన్ వైఖరిపై విరుచుకుపడ్డారు. రాష్ట్ర విభజన తర్వాత తాను ముఖ్యమంత్రిని కావచ్చని, అక్రమాస్తుల కేసుల నుంచి తప్పించుకోవచ్చని ఆశించి జగన్ భంగపడ్డారని ఆయన అన్నారు. 11 కేసులు, 16 నెలల జైలు జీవితం, లక్షల కోట్ల అవినీతిపరుడిగా వైఎస్ జగన్ కు చంద్రబాబును విమర్శించే అర్హత లేదని పల్లె తేల్చేశారు.