: ఆ బిల్లు పాసైతే!... బ్యాంకులకు రూ.5 లక్షల కోట్ల మొండి బకాయిలు వసూలైనట్టే!
నిజమే, దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేటు రంగ బ్యాంకులతో పాటు ఆర్థిక రంగ నిపుణులు... ఆ బిల్లు పాసవుతుందా? లేదా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే సదరు బిల్లు పాసైతే... ఏకంగా రూ.5 లక్షల కోట్ల మేర మొండి బకాయిల వసూలుకు అవకాశం చిక్కుతుంది. ఇంతటి ప్రాధాన్యమున్న బిల్లే... రుణ రికవరీ బిల్లు. ఈ బిల్లు నేడు పార్లమెంటులోని దిగువ సభ లోక్ సభ ముందుకు రానుంది. లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా లాంటి రుణ ఎగవేతదారుల తాట తీయడంతో పాటు దేశంలో వ్యాపారాన్ని సులభతరం చేసేందుకే ఈ బిల్లు రూపొందినట్లు సమాచారం. ఈ బిల్లు పాసైతే... మొండి బకాయిలుగా మారిన దాదాపు రూ.5 లక్షల అప్పులను రాబట్టుకునేందుకు బ్యాంకులకు అవకాశం లభిస్తుందన్న విశ్లేషణలు కొనసాగుతున్నాయి.