: 'కొత్త జంట' సినిమా తరువాత అందరికీ నచ్చే సినిమా చేయాలని ఇన్నాళ్లూ ఆగాము: అల్లు శిరీష్


నాలుగు గంటలు కేటాయించి, సినిమా చూసేందుకు వచ్చే అభిమానులను ఆనందపెట్టాలన్న లక్ష్యంతోనే 'శ్రీరస్తు శుభమస్తు' సినిమాను రూపొందించామని హీరో అల్లు శిరీష్ అన్నాడు. 'కొత్త జంట' సినిమా విజయం తరువాత ఏదో ఒక సినిమా చేయాలని భావించలేదని అన్నాడు. అందుకే మంచి సినిమా తీయాలని భావించి, దర్శకుడు పరశురాంతో చాలా కాలం ఆలోచించి సబ్జెక్టు ఎంచుకున్నానని అన్నాడు. సినిమా చాలా బాగా వచ్చిందని, సినిమా అందర్నీ అలరిస్తుందన్న నమ్మకం తనకు ఉందని శిరీష్ తెలిపాడు. ఈ సినిమాకోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలని శిరీష్ చెప్పాడు. ప్రధానంగా గీతా ఆర్ట్స్ కోసం కష్టపడే బన్నీ వాసు, నాగరాజు తదితరులను ఎంత అభినందించినా సరిపోదని చెప్పాడు. హీరోయిన్ లావణ్య రాష్ట్రం కాని రాష్ట్రం నుంచి వచ్చి డైలాగులు బట్టీ పట్టడమే కాకుండా, వాటి అర్థాలు తెలుసుకుని భావానికి తగ్గట్టుగా నటిస్తుందని, ఈ సినిమా తరువాత 'శ్రీరస్తు శుభమస్తు'కు ముందు లావణ్య, తరువాత లావణ్య అనే ఫేజెస్ చూస్తుందని శిరీష్ చెప్పాడు.

  • Loading...

More Telugu News