: ప్రధాని అపాయింట్ మెంట్ కోరుతూ ఇద్దరు కేంద్ర మంత్రులు, టీడీపీ ఎంపీల లేఖ


ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్ మెంట్ కోరుతూ కేంద్ర మంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనాచౌదరి, టీడీపీ ఎంపీలు లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరితో విసిగిపోయిన ప్రజల ఆగ్రహంతో టీడీపీ కూడా జతకలిసింది. రాజ్యసభలో ఏపీకి ప్రత్యేకహోదాపై జరిగిన చర్చ సందర్భంగా అరుణ్ జైట్లీ సమాధానంతో అసహనానికి గురైన ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ కీలక నేతల సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకనుగుణంగా ప్రధానితో హోదాపై తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ప్రధాని అపాయింట్ మెంట్ కోరుతూ వారంతా లేఖ రాశారు.

  • Loading...

More Telugu News