: లార్డ్స్ సంప్రదాయం... ఇకపై ఈడెన్ గార్డెన్స్ లో కూడా గంట మోగనుంది!
ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో టెస్టు మ్యాచ్ ప్రారంభం కావాలంటే ముందు గంట మోగాలి. గంట మోగిన తరువాతే టెస్టు మ్యాచ్ ప్రారంభమవుతుంది. పెవిలియన్ వెలుపల ఉండే బౌలర్ల బార్ లో ఈ గంట ఉంటుంది. దీనిని టెస్టు ప్రారంభానికి ముందు దిగ్గజ క్రికెటర్లు మ్రోగిస్తారు. దీంతో టెస్టు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ సంప్రదాయాన్ని కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో కూడా ప్రవేశపెట్టాలని క్యాబ్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ భావించాడు. దీంతో ఈ మేరకు ప్రయత్నాలు ప్రారంభించాడు. ఇప్పటికే గంటను కొనుగోలు చేశామని, సెప్టెంబర్ లో దీనిని ప్రతిష్ఠించాలని భావిస్తున్నామని గంగూలీ తెలిపాడు. టీమిండియా పర్యటన సందర్భంగా 2014లో గంగూలీ లార్డ్స్ లో గంటకొట్టే అవకాశం దక్కించుకున్న సంగతి తెలిసిందే.