: బంగాళాఖాతంలో అల్పపీడనం...తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాదు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ఈ అల్పపీడనానికి రుతుపవనాలు జతకలిశాయని వారు వెల్లడించారు. దీంతో ఈ అల్పపీడనం బలంగా ఉందని, దీని కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వారు తెలిపారు. ప్రధానంగా ఉత్తరకోస్తాలో దీని ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని, అక్కడి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఇతర ప్రాంతాల్లో ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని వారు సూచించారు. వ్యవసాయదారుల్లో ఈ వార్తలు ఆనందం నింపుతున్నాయి.