: వారిని కృష్ణా పుష్కరాల్లో పుణ్యస్నానం చేసి అలా చెప్పమనండి!: డీకే ఆరుణ సవాల్


తాను టీఆర్ఎస్ లో చేరడానికి ప్రయత్నించానంటూ వస్తున్న ఆరోపణలను డీకే అరుణ తీవ్రంగా స్పందించారు. అసలు అటువంటి ఆరోపణలు చేసిన వారెవరని ఆమె అడిగారు. ఒకవేళ ఈ ఆరోపణలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితలెవరైనా చేసి ఉంటే... రానున్న కృష్ణా పుష్కరాలలో నదిలో పుణ్య స్నానం చేసి ప్రమాణపూర్వకంగా ఈ ఆరోపణలు చేయాలని ఆమె సవాల్ విసిరారు. రాజకీయాల్లో భాగంగా చాలా ఆరోపణలు చేస్తారని, ఇవి కూడా అలాంటి ఆరోపణలే తప్ప తానేనాడూ పార్టీ మారే ఆలోచన చేయలేదని ఆమె చెప్పారు. ప్రతిపక్షంలో కూర్చోవడం నేరం కాదని, ఇప్పుడు అధికారంలో ఉన్నవారు కూడా గతంలో ప్రతిపక్షంలో కూర్చున్నవారేనని, 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఉద్యమపార్టీకి అవకాశం ఇద్దామని ప్రజలు భావించారని, అందుకే వారి పరిపాలనా తీరును గమనిస్తున్నారని ఆమె చెప్పారు.

  • Loading...

More Telugu News