: కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి కోసం తెలంగాణ ఉద్యమం చేయలేదా?: డీకే ఆరుణ
తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ తన రాజకీయ మనుగడ కోసం చేయలేదా? అని డీకే అరుణ ప్రశ్నించారు. టీవీ ఛానెల్ తో ఆమె మాట్లాడుతూ, కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి కోసం తెలంగాణ ఉద్యమాన్ని చేయలేదా? అని అడిగారు. అయినప్పటికీ ప్రజలకు మేలు జరగాలని కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసిందని ఆమె చెప్పారు. తాము చేసిన పోరాటానికే సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని ఆమె అన్నారు. రాజకీయ మనుగడ కోసం, ముఖ్యమంత్రి పదవి కోసం ఉద్యమాన్ని కేసీఆర్ చేస్తే త్యాగం అయినప్పుడు, గద్వాల జిల్లా కోసం పోరాడడం తప్పు అని ఎలా అంటారని ఆమె నిలదీశారు. తనను అణగదొక్కేందుకు ఎన్నో కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్నారని ఆమె చెప్పారు. తెలంగాణలో జిల్లాలు ఏర్పాటు కానున్నప్పుడు తమ న్యాయమైన కోరిక తీర్చాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉందని ఆమె తెలిపారు.