: మంత్రికి, మాగ్నటిక్ సంస్థకు సంబంధం లేదు... పరీక్షల నిర్వహణలో మంత్రులు అవినీతికి పాల్పడే అవకాశం లేదు: టీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి
ఎంసెట్-2 నిర్వహణలో పాలుపంచుకున్న మాగ్నటిక్ సంస్థతో మంత్రి కేటీఆర్ కు సంబంధాలున్నాయన్న షబ్బీర్ అలీ ఆరోపణలపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి మండిపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, అర్థం లేని ఆరోపణలతో ఎంసెట్ విద్యార్థులను ప్రతిపక్షాలు గందరగోళానికి గురి చేస్తున్నాయని అన్నారు. పరీక్షల నిర్వహణలో మంత్రులకు ఎలా సంబంధం ఉంటుందని ఆయన నిలదీశారు. ప్రాధమిక అంశాలపై కూడా కాంగ్రెస్ నేతలకు అవగాహన లేకుండా పోయిందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంసెట్ విషయంలో చట్టాలకు లోబడి చిత్తశుద్ధితో పని చేసుకుని ముందుకు వెళ్తుందని ఆయన స్పష్టం చేశారు. దీనితో మంత్రులకు సంబంధం లేదని, వారు రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు.