: తనే నాకు పెద్ద గిఫ్ట్... వేరే గిఫ్ట్ ఎందుకు?: సినీ నటి 'అంకిత' భర్త
వివాహం చేసుకుని అమెరికాలో స్థిరపడిన సినీ నటి అంకిత, తెలుగులో మళ్లీ అవకాశం వస్తే నటించేందుకు తనకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పింది. తెలుగు సినిమాలను మిస్ అవుతున్నానని చెప్పింది. వివాహానంతరం ఆనందంగా ఉన్నానని, తన భర్త తనను బాగా చూసుకుంటారని ఆమె తెలిపింది. ప్రేమకు గుర్తుగా వజ్రపుటుంగరాలు బహూకరిస్తుంటాడని చెప్పింది. ఈ సందర్భంగా మీరు మీ భర్తకు ఏమిచ్చారని అడుగగా, దానికి ఆమె భర్త స్పందించి, 'తనే నాకు పెద్ద గిఫ్ట్. మళ్లీ ఆమె నాకు వేరే గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది?' అన్నాడు నవ్వుతూ. తెలుగు సినిమాల్లో ఆమె నటించిందని తనకు తెలుసు కానీ, ఆ సినీ పరిశ్రమ గురించి ఏమాత్రం అవగాహన లేదని అన్నాడు. అప్పుడప్పుడు తను నటించిన సినిమాలలోని పాటలను చూపిస్తుందని, అవి బాగుంటాయని ఆయన పేర్కొన్నాడు. వివాహం తరువాత జీవితం బాగుందని, హాయిగా గడిచిపోతోందని ఆ దంపతులు ఓ టీవీ ఇంటర్వ్యూలో తెలిపారు.