: ఆఫ్ఘనిస్థాన్‌ లో ఆరేళ్ల పాపను పెళ్లాడిన 60 ఏళ్ల మత గురువు!


ఆఫ్ఘనిస్థాన్‌ లోని ఘోర్‌ ప్రావిన్స్‌ లో కనీసం సరిగ్గా మాట్లాడడం కూడా రాని ఆరేళ్ల పాపను ఓ మతగురువు వివాహం చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. బాలిక తల్లిదండ్రులు మతాచారం ప్రకారం చెల్లించుకున్న కానుక అదని, అందుకే ఆమెను తాను మనువాడానని మహమ్మద్ కరీమ్ (60) చెబుతున్నారు. అయితే బాలిక తల్లిదండ్రులు మాత్రం తమకు తెలియకుండా తమ బిడ్డను కిడ్నాప్‌ చేసి వివాహం చేసుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని, బాలికకు వైద్యపరీక్షలు నిర్వహించారు. కాగా, ఆమెపై ఎలాంటి అవాంఛనీయ చర్యలకు పాల్పడలేదని తేల్చారు. కాగా, బాలికను మరొకరి సంరక్షణలో ఉంచారు. అఫ్ఘానిస్థాన్‌ చట్టాల ప్రకారం వివాహానికి సరైన వయస్సు అమ్మాయిలకు 16 ఏళ్లు, అబ్బాయిలకు 18 ఏళ్లు. కాగా, షరియత్ చట్టం ప్రకారం తండ్రి లేదా, తాత ఒప్పుకుంటే చిన్నపిల్లలకు కూడా పెళ్లిళ్లు చెయ్యొచ్చు. దీనిని అనుకూలంగా మలచుకునే చాలా మంది డబ్బులు ఆశచూపి పిల్లలను వివాహం చేసుకుంటున్నారని నివేదికలు చెబుతున్నాయి.

  • Loading...

More Telugu News