: చెత్త బ్యాటింగే కొంప ముంచింది: స్టీవ్ స్మిత్
శ్రీలంక జట్టుతో ఓటమి ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ లో అసహనం నింపింది. బౌలర్ల ప్రతిభతో తొలి ఇన్నింగ్స్ లో 86 పరుగుల ఆధిక్యంలో నిలిచిన ఆస్ట్రేలియా జట్టు పట్టుబిగించాల్సిన దశలో శ్రీలంక జట్టు కోలుకుని భారీ స్కోరు సాధించి, 268 పరుగుల లక్ష్యం విధించింది. దీంతో అద్భుతమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉన్న ఆస్ట్రేలియా జట్టు రెండో ఇన్నింగ్స్ లో కేవలం 161 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో బ్యాట్స్ మన్ వల్లే జట్టు ఓటమి పాలైందని, ఉపంఖండం పిచ్ లపై అవగాహన ఉన్న ఆటగాళ్లు కూడా విఫలమవ్వడంపై స్మిత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. చెత్త బ్యాటింగ్ వల్లే ఒటమిపాలయ్యామని అభిప్రాయపడ్డాడు. బ్యాట్స్ మన్ విఫలమైన చోట బౌలర్లు అద్భుతంగా రాణించారని, శక్తి వంచన లేకుండా విజయానికి ప్రయత్నించారని స్టీవ్ స్మిత్ తెలిపాడు.