: 'చంద్రబాబుకు మీరైనా చెప్పండి': సుజనా, సీఎం రమేశ్ లకు లగడపాటి ఫోన్
విజయవాడలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం తొలగింపుపై మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ స్పందించారు. విగ్రహం తీసివేత తగదని సీఎం చంద్రబాబుకు నచ్చజెప్పాలని కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఎంపీ రమేశ్ లకు లగడపాటి స్వయంగా ఫోన్ చేశారు. వారి మాటలను చంద్రబాబు వినకుంటే, తానే స్వయంగా వచ్చి మాట్లాడుతానని అన్నారు. సుజనా, రమేశ్ లకు ఫోన్ చేసిన విషయాన్ని మీడియాకు వెల్లడించిన లగడపాటి, ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. తాను టీడీపీ నేతలతో మాట్లాడినా పట్టించుకోకుండా విగ్రహం తొలగింపుపై తొందర పడ్డారని విమర్శించారు.