: నాలుకతో ముక్కును, మోచేతినీ తాకుతున్న యువతి... వీడియో వైరల్!
నాలుకతో ముక్కును తాకగలరా? ఈ ఫీట్ చేయాలని ఎంతో మంది గంటల కొద్దీ ప్రయత్నించి విఫలమయ్యారు. ఇక నాలుకతో మోచేతిని తాకాలంటే, అది దాదాపు అసంభవమే. కానీ, ఈ అమెరికా అమ్మడికి మాత్రం అది సాధ్యమైంది. ఫ్లోరిడా పరిధిలోని ఒకాలా ప్రాంతానికి చెందిన జెర్కరీ బ్రచో అనే యువతి సామాజిక మాధ్యమాల్లో పెడుతున్న వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. నాలుకతో ముక్కుతో పాటు కళ్లను కూడా తాకడం, మోచేతి కొనను చుంభించడం వంటి ఫీట్లన్నీ అవలీలగా చేసేస్తుంటే, చూస్తున్న వారు ఔరా అని ఆశ్చర్యపోతున్నారు.