: మహిళ ఆత్మహత్య కేసులో... మరో 'ఆప్' ఎమ్మెల్యే అరెస్ట్


ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా కార్యకర్త ఆత్మహత్య చేసుకున్న కేసులో ఆ పార్టీ ఎమ్మెల్యే చౌహాన్ ను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఉదయం చౌహాన్ ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి స్టేషనుకు తరలించారు. చౌహాన్ సహా ఏడుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు అందరినీ అరెస్ట్ చేశారు. కాగా, తనను లైంగికంగా వేధించారని, పార్టీలో ఎదగాలంటే శీలంపై మక్కువ చంపుకోవాలని పార్టీ నేతలు చెప్పినట్టు ఆరోపిస్తూ, మహిళా కార్యకర్త ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అరెస్ట్ చేసిన ఎమ్మెల్యేకు వైద్య పరీక్షలు చేయించి, ఆపై మేజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తామని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News