: అర్ధరాత్రి హైడ్రామా... ఎంసెట్-2 నిందితులు మెజిస్ట్రేట్ ముందుకు, ఆ వెంటనే కస్టడీకి!


ఎంసెట్-2 లీకేజీ కేసులో తెలంగాణ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన నిందితులను శనివారం అర్ధరాత్రి పోలీసులు మెజిస్ట్రేట్ ఇంటికి తీసుకువెళ్లి హాజరు పరిచారు. మీడియా వెంటాడవచ్చన్న ఉద్దేశంతో, అత్యంత నాటకీయ పరిస్థితుల మధ్య కాస్తంత హైడ్రామా నడిపిన సీఐడీ అధికారులు నిందితులను బంజారాహిల్స్ లోని జడ్జీల క్వార్టర్స్ కు తీసుకు వెళ్లి న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. న్యాయమూర్తి 14 రోజుల రిమాండుకు ఆదేశించగా, ఆ వెంటనే వీరిని మరింతగా విచారించాల్సి వుందని పిటిషన్ ఇవ్వడంతో, వారిని సీఐడీ కస్టడీకి అప్పగించేందుకు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. నిందితులను విచారించి, లీకేజీ కేసులో మరిన్ని వివరాలు రాబట్టాల్సి వుందని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News