: తెలంగాణకు ఎప్పటికీ చంద్రబాబు శత్రువే: కవిత నిప్పులు


తెలంగాణ రాష్ట్రానికి, ఇక్కడి ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఎప్పటికీ శత్రువేనని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత నిప్పులు చెరిగారు. రాజ్యసభలో తెలుగుదేశం ఎంపీల ప్రసంగంతో తెలంగాణపై వారు ఎటువంటి ఉద్దేశంతో ఉన్నారో మరోసారి వెల్లడైందని అన్నారు. రాజ్యసభలో ప్రత్యేక హోదాపై చర్చతో ఎవరు ఎలాంటి వాళ్లో ప్రజలకు మరోసారి స్పష్టమైందని విమర్శించారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడితో పాటు జైరాం రమేష్, సీఎం రమేష్ వంటి వాళ్ల మనసులో ఏముందో తెలిసిపోయిందని అన్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో జరిగిన పేపర్ లీకేజీ తరువాత, తెలంగాణ బిడ్డలకు మంచి జరగాలన్న ఉద్దేశంతోనే ఎంసెట్ - 3 పెట్టాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చిందని అన్నారు.

  • Loading...

More Telugu News