: అసోం వరద బాధితులకు రూ.4 లక్షల పరిహారం ప్రకటించిన రాజనాథ్ సింగ్
వరదలతో అతలాకుతలమవుతున్న అసోంను శనివారం సందర్శించిన కేంద్ర హోంమంత్రి రాజనాథ్ సింగ్ పలు జిల్లాల్లో ఏరియల్ సర్వే నిర్వహించిన సంగతి తెలిసిందే. సర్వే అనంతరం విలేకరులతో మాట్లాడిన మంత్రి వరద బాధితులకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నట్టు చెప్పారు. సహాయ కార్యక్రమాల కోసం 60 బోట్లను సిద్ధం చేసినట్టు తెలిపారు. వరదలతో అతలాకుతలమైన అసోంను ఆదుకునేందుకు ఎన్జీవోలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కజిరంగా, నాగోవ్, మోరిగావ్లు వరదల కారణంగా దారుణంగా దెబ్బతిన్నట్టు రాజ్నాథ్ వివరించారు.