: హిల్లరీ గొంతుతో మిమిక్రీ చేసిన డొనాల్డ్ ట్రంప్!


రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి నామినేషన్ సంపాదించిన తనకు, డెమొక్రాట్ అభ్యర్థిని హిల్లరీ క్లింటన్ అభినందనలు తెలియజేయలేదని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ఆమె గొంతును అనుకరిస్తూ, మిమిక్రీ చేసిన ట్రంప్, ఇకపై తాను హిల్లరీ విషయంలో మంచోడిలా వ్యవహరించబోనని అన్నారు. డెమోక్రాట్ నేతలకు బుద్ధి చెప్పనున్నానని, హిల్లరీకి ఏ విషయంలోనూ నిర్ణయం తీసుకోవడం చేతకాదని, ఆమెకు జాతీయ భద్రతపై అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వొద్దని అన్నారు. డెమోక్రాట్ జాతీయ సదస్సులో హిల్లరీ ప్రసంగిస్తుండగా, కునుకు తీస్తున్నట్టు కనిపిస్తున్న బిల్ క్లింటన్ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసిన ట్రంప్, ఆమె వైఖరితో బిల్ కూడా విసిగిపోయారని నిప్పులు చెరిగారు.

  • Loading...

More Telugu News