: ఆర్మీ నేరుగా కాల్పులు జరపొచ్చు.. కానీ లాఠీలు ఉపయోగించకూడదు: రక్షణ మంత్రి పారికర్


ఆందోళనలను అణచివేసేందుకు ఆర్మీ నేరుగా కాల్పులు జరపవచ్చని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ అన్నారు. తానైతే లాఠీలు ఉపయోగించమని చెప్పనని పేర్కొన్నారు. మణిపూర్‌లో ఆర్మ్‌డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ (ఏఎఫ్‌ఎస్‌పీఏ)ను విధించడం, ప్రత్యేక బలగాలను మోహరించడంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన స్పందిస్తూ పైవిధంగా వ్యాఖ్యానించారు. ప్రజలను కోల్పోవడం తమకు ఇష్టం లేదని పేర్కొన్నారు. ఆర్మీని మోహరించిన ప్రాంతాల్లో ‘పవర్’ కూడా ఉపయోగించాల్సి ఉంటుందన్నారు. ప్రకృతి విపత్తుల సమయంలో తప్ప ఇంకెక్కడా ఆర్మీని ఉపయోగించుకోకుండా ఉంటేనే తనకు సంతోషంగా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News