: కేంద్రం నుంచి బయటకు వస్తే ఏపీకి నిధులు ఆగిపోతాయి: టీజీ వెంకటేష్


కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఆగిపోతాయని టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ తెలిపారు. ప్రత్యేకహోదాపై రాష్ట్రంలో నెలకొన్న భావోద్వేగాలపై ఆయన మాట్లాడుతూ, బీజేపీతో తాడోపేడో తేల్చుకోవాలని తమకు కూడా ఉందని అన్నారు. అయితే ప్రస్తుతం అది సాధ్యం కాదని ఆయన చెప్పారు. ప్రత్యేకహోదాపై ఏదో బూచిచూపెడుతూ అరుణ్ జైట్లీ భయపెట్టే ప్రయత్నం చేశారని ఆయన తెలిపారు. ప్రత్యేకహోదా వస్తే రాష్ట్రానికి మరింత మంచి జరుగుతుందని చంద్రబాబు భావిస్తున్నారని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యం కనుక కేంద్రంలో కొనసాగుతూనే పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News