: వర్షాల ధాటికి ఒడిశాలో ఐదు జిల్లాలు అతలాకుతలం
ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాలకు ఐదు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ధాటికి జనజీవనం స్తంభించిపోయింది. వర్షాల కారణంగా పడిన పిడుగుల ధాటికి 20 మంది మృత్యు వాతపడ్డారు. మరో 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో వివిధ ప్రాంతాల్లో ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. నిత్యావసరాలు అందక ఈ ఐదు జిల్లాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒడిశాలో వెనుకబడిన ప్రాంతాల్లో వరదలు ప్రతాపం చూపడంతో నిరుపేదల ఇక్కట్లు మరింత పెరిగాయి. సహాయక సిబ్బంది నష్టనివారణ చర్యలు ప్రారంభించారని ప్రభుత్వం ప్రకటించింది.