: ఊహించిందే జరిగింది.. బాలీవుడ్ మూవీ ‘డిష్యూం’పై నిషేధం విధించిన పాకిస్థాన్
వరుణ్‌ధావన్, జాన్ అబ్రహం, జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌లు ప్రధాన తారాగణంగా రూపుదిద్దుకున్న బాలీవుడ్ చిత్రం ‘డిష్యూం'. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ కూడా అతిథి పాత్రలో నటించాడు. నిన్న విడుదలయిన ‘డిష్యూం’కి ఓవైపు భారత్‌లో ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ వస్తోంటే మరోవైపు పాకిస్థాన్‌లో దీనిపై నిషేధం విధించారు. ఈ సినిమా పాకిస్థాన్‌లో విడుదల అవుతుందా.. లేదా..? అన్న విషయంపై ఆ చిత్రం యూనిట్ ఎప్పటి నుంచో సందేహంగానే ఉంది. చివరికి అదే జరిగింది. పాకిస్థాన్ ఈ చిత్రాన్ని నిషేధించడం పట్ల వరుణ్ తీవ్ర నిరాశని వ్యక్తం చేశాడు. ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ.. ఈ చిత్రాన్ని ఆ దేశంలో నిషేధించారని తెలిసి ఎంతో బాధపడినట్లు పేర్కొన్నాడు. ఈ సినిమాలో ఏ దేశాన్నీ వక్రీకరిస్తూ చూపించలేదని ఆయన తెలిపాడు. పాకిస్థాన్ విధించిన నిషేధం తప్పుడు నిర్ణయమేనని ఆయన పేర్కొన్నాడు. ఆ దేశానికి వ్యతిరేకంగా ఉండే సీన్లు తమ సినిమాలో లేవని ఆయన చెప్పాడు. ఇరు దేశాల మధ్య జరగాల్సిన ఫైనల్ మ్యాచ్‌కి కేవలం 36 గంటల ముందు ఒక ఇండియన్ క్రికెటర్ కిడ్నాప్ అవుతాడని, కేవలం ఈ అంశంపైనే డిష్యూం కథ నడుస్తుందని ఆయన పేర్కొన్నాడు.