: ఏపీలో బీజేపీ నేతలను తిరగనియ్యొద్దు... పోరాటానికి జగన్ కూడా కలిసి రావాలి: గాలి ముద్దుకృష్ణమనాయుడు
ఏ టాపిక్ మాట్లాడినా జగన్ పై విమర్శలతో ముగించే టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు ఈ రోజు మాత్రం మాట మార్చి, జగన్ తమతో కలిసి పోరాటం చేయాలని అన్నారు. ఏపీని బీజేపీ నేతలు నిలువునా ముంచారని పేర్కొన్న గాలి ముద్దుకృష్ణమ బీజేపీ నేతలు అధిష్ఠానంపై పోరాడాలని పిలుపునిచ్చారు. బీజేపీ నేతలు రాష్ట్రానికి హోదా వచ్చేలా పార్టీపై ఒత్తిడి పెంచాలని సూచించారు. లేని పక్షంలో ప్రజలు వారిని రాష్ట్రంలో తిరగనియ్యకూడదని పిలుపునిచ్చారు. ఏపీకి ప్రత్యేకహోదా సాధించిన తరువాతే బీజేపీ నేతలు రాష్ట్రంలో కాలు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాలకోసం పార్టీలన్నీ ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు.