: ఉత్తరాఖండ్ తిరుగుబాటు నేత, మాజీ మంత్రిపై అత్యాచారం కేసు
ఉత్తరాఖండ్ మాజీ మంత్రి, బీజేపీ నేత హరక్ సింగ్ రావత్ పై అత్యాచార కేసు నమోదైంది. గ్రీన్‌పార్క్‌లోని తన నివాసానికి రమ్మని చెప్పిన రావత్ అక్కడ తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆయనపై అత్యాచారం కేసు పెట్టారు. కాగా, 15 ఏళ్ల క్రితం కూడా ఈమె ఆయనపై అత్యాచారయత్నం కేసు పెట్టినట్టు పోలీసులు వెల్లడించారు. తాజాగా ఉత్తరాఖండ్ లో చోటుచేసుకున్న రాజకీయ సంక్షోభంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ముఖ్యమంత్రిపై వ్యతిరేకతతో, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబావుటా ఎగురవేసేలా చేసి, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు కారణమైన వారిలో రావత్ ప్రథముడు. అనర్హత అనంతరం ఆయన బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.