: వైసీపీ చేపట్టిన ఏపీ బంద్ విజయవంతం కావాలి: ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా


ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ప్ర‌త్యేక హోదాను డిమాండ్ చేస్తూ వ‌చ్చేనెల 2న రాష్ట్ర బంద్ నిర్వ‌హించాల‌ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపునకు ఏపీసీసీ అధ్య‌క్షుడు ర‌ఘువీరా రెడ్డి మ‌ద్ద‌తు తెలిపారు. అనంత‌పురం జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. వైసీపీ చేప‌ట్ట‌నున్న బంద్ విజ‌య‌వంతం అవుతుంద‌న్నారు. టీడీపీ, బీజేపీకి మధ్య జ‌రిగిన ర‌హ‌స్య‌ ఒప్పందాల వల్లే ఏపీకి ప్రత్యేక హోదా అంశంలో ఇలా జ‌రుగుతోంద‌ని ఆయ‌న అన్నారు. టీడీపీ ఎంపీలు అసెంబ్లీ సీట్ల పెంపుపై ఎంతో శ్ర‌ద్ధ క‌న‌బ‌రుస్తున్నార‌ని, ఆ శ్రద్ధ ప్రత్యేక హోదాపై కనబరిస్తే బాగుండేద‌ని ఆయ‌న విమ‌ర్శించారు.

  • Loading...

More Telugu News