: 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత టెస్టుల్లో ఆస్ట్రేలియాపై నెగ్గిన శ్రీలంక
శ్రీలంక, ఆస్ట్రేలియా మధ్య మూడు టెస్టు మ్యాచుల సిరీస్‌లో భాగంగా శ్రీలంకలోని పల్లెకిలలో జరిగిన తొలి టెస్టు మ్యాచులో శ్రీలంక 106 పరుగుల తేడాతో విజయం సాధించింది. 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత టెస్టుల్లో ఆస్ట్రేలియాపై శ్రీలంక నెగ్గింది. శ్రీలంక తొలి ఇన్సింగ్స్‌లో 117 (34.2 ఓవర్లలో) పరుగులు చేయగా, రెండో ఇన్సింగ్స్‌లో 353(93.4) పరుగులు చేసింది. ఆస్ట్రేలియా తొలి ఇన్సింగ్స్‌లో 203 (79.2), రెండో ఇన్సింగ్స్‌లో 161(88.3) పరుగులు చేసింది. మొదటి ఇన్సింగ్స్‌లో ఆధిక్యం పదర్శించిన ఆస్ట్రేలియా రెండో ఇన్సింగ్స్‌లో ఘోరంగా విఫలమయింది. ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ స్టీవెన్ స్మిత్ టెస్టుల్లో సారథిగా మొదటిసారి పరాజయాన్ని మూటగట్టుకున్నాడు.