: మోడీ యోధుడేంటి, అంతా మీడియా సృష్టే: దిగ్విజయ్
వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థి అంటూ గుజరాత్ సీఎం నరేంద్ర మోడీని మీడియానే ఆకాశానికెత్తేస్తోందని, ఆయన్ని యోధుడిగా అభివర్ణించడం కూడా ప్రసార మాధ్యమాల చలవేనని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ అభిప్రాయపడ్డారు. భోపాల్ లో నేడు ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏమైనా, తాము సిద్ధాంతాలతోనే పోటీ పడతామని, వ్యక్తులతో తమ పోరాటం ఉండదని ఆయన స్పష్టం చేశారు. కర్ణాటక ఎన్నికలు రాహుల్, మోడీ మధ్య సమరంలా భావించవద్దని దిగ్విజయ్ చెప్పుకొచ్చారు. కన్నడనాట ఎన్నికల్లో తాము గెలవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.