: ‘హోదా’ కోసం రాజీనామాలకు సిద్ధం!... కేశినేని నాని సంచలన ప్రకటన!


ఏపీకి ప్రత్యేక హోదా కోసం త్యాగాలకు సిద్ధమంటూ టీడీపీ ఎంపీలు వరుసగా ప్రకటనలు గుప్పిస్తున్నారు. నేటి ఉదయం రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీమోహన్ ఈ తరహాలో ఓ ప్రకటన చేశారు. కొద్దిసేపటి క్రితం విజయవాడ ఎంపీ కేశినేని నాని తన సొంతూరు బెజవాడలోనే ఇదే తరహాలోనే మరో ప్రకటన గుప్పించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం తన ఎంపీ పదవికి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమని ఆయన ప్రకటించారు. రాష్ట్ర ప్రయోజనాల ముందు తమకు ఎంపీ పదవులు ముఖ్యమేమీ కాదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించేందుకు పార్లమెంటును స్తంభింపజేయడానికి కూడా సిద్ధమవుతున్నామని నాని పేర్కొన్నారు. రేపు చంద్రబాబుతో జరగనున్న సమావేశంలో భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని ఆయన చెప్పారు. రెండు మంత్రి పదవులు పోయినంత మాత్రాన తమకు వచ్చే నష్టమేమీ లేదని కూడా కేశినేని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించలేమన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యలు సరికాదని ఆయన అన్నారు. రాష్ట్రానికి మంచి జరుగుతుందనే కేంద్ర కేబినెట్ లో చేరామని నాని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News