: షార్ లోకి చొరబడ్డ ఉగ్రవాది?... అదుపులోకి తీసుకుని విచారిస్తున్న సీఐఎస్ఎఫ్ బలగాలు!


భారత అంతరిక్ష పరిశోధనలకు సంబంధించి ఏపీలోని నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం (షార్) అత్యంత కీలకమైనది. భారత్ ప్రయోగిస్తున్న ఉపగ్రహాలన్నీ ఇక్కడి నుంచే అంతరిక్షంలోకి వెళుతున్నాయి. ఇంతటి కీలక కేంద్రంపై ఉగ్రవాదులు గురి పెట్టారా? అంటే... అవుననే అంటున్నాయి షార్ వర్గాలు. గుర్తు తెలియని ఓ వ్యక్తి నిన్న సముద్ర మార్గం మీదుగా పడవలో వచ్చి షార్ లోకి చొరబడ్డాడు. రీయూజబుల్ రాకెట్లను శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్న సమయంలో గుట్టుచప్పుడు కాకుండా సదరు వ్యక్తి షార్ లోకి ఎంటరయ్యాడు. అయితే అతడి కదలికలను వేగంగా పసిగట్టిన సీఐఎస్ఎఫ్ బలగాలు అతడిని అదుపులోకి తీసుకున్నాయి. షార్ లో విధ్వంసం సృష్టించేందుకే అతడు షార్ లోకి ప్రవేశించాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

  • Loading...

More Telugu News